ఆదివారం, మే 26, 2024
Homeజాతీయంలాక్ డౌన్ మినహాయింపు… లిస్ట్ లో మరికొన్ని.. హోం శాఖ నిర్ణయం

లాక్ డౌన్ మినహాయింపు… లిస్ట్ లో మరికొన్ని.. హోం శాఖ నిర్ణయం

గతకొద్ది రోజులుగా లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో వీటిని రెడ్ జోన్స్ గా ప్రకటించింది కేంద్రం ఆ ప్రాంతాలకు కట్టుదిట్టమైన ఆంక్షలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 20 నుండి మరికొన్ని రంగాలకు లాక్ డౌన్ నుండి మినహాయింపు ఇస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి  తెలిసిందే.

ఆ మినహాయింపుల జాబితా లో ఇప్పుడు మరికొన్నింటిని కేంద్ర ప్రభుత్వం చేర్చింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు, మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్లను ఎసెన్షియల్ సర్వీసెస్ కింద గుర్తిస్తూ వాటికి ఏప్రిల్- 20వ తేదీ నుంచి లాక్ డౌన్ ఆంక్షల నుండి మినహాయింపు ఇస్తునట్లు తెలిపింది.

ఇక ప్రభుత్వ మినహాయింపు ఇస్తే ఈ సంస్థలు ఏప్రిల్ 20వ తేదీ తరువాత  తమ పనులని మొదలుపెట్టనున్నాయి. ఇక షెడ్యూల్డ్ తెగలవాళ్లు చేసే కుల వృత్తులు, అటవీ ఉత్పత్తులు అంటే వక్క, కోకో తోటలు, కొబ్బరి, స్పైస్ బాంబోవీటిని కూడా  ఆంక్షల నుండి సడలింపు ఇస్తున్నట్లు వీటిని లిస్ట్ లో చేర్చారు.

ఇక  గ్రామాలలో లాక్ డౌన్  మినహాయింపుల విషయానికి వస్తే నీటి సరఫరా, పారిశుధ్యం, విద్యుత్ లైన్లు, టెలికాం, ఆప్టికల్ ఫైబర్స్ మరియు కేబుల్స్ వేయడం వంటి వాటికి కూడా అనుమతిలో ఉన్నాయని హోం మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్ లో తెలిపింది.

ఇక ఈ కామర్స్ విసయానికొస్తే ఇక ఆన్లైన్లో కొన్ని వస్తువులు కొనుగోలు చెయ్యొచ్చని కాకపోతే ఈ-కామర్స్ కంపెనీలు తమ ట్రాన్స్పోర్ట్ వాహనాలను రోడ్లపై తిరిగేందుకు అధికారుల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలియజేసింది. వీటితోపాటు ప్రజలు సామజిక దూరం పాటించాలి, గుంపులుగా గుమిగూడేలా పద్ధతులు పాటించరాదని  హోంశాఖ స్పష్టం చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular