లాక్ డౌన్ పుకార్లపై కేంద్ర మంత్రి సీరియస్.. వివరణ ఇచ్చిన లవ్ అగర్వాల్

0
360
lav agarwal
lav agarwal

కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా ఈ నెల 14 వరకూ లాక్ డౌన్ విదించిన నేపద్యంలో ఈ గడువు ఇంకా కొన్ని రోజులు మాత్రమె మిగిలి ఉండడంతో దేశ ప్రజలకు ఈ గడువు పోడిగిస్తారా లేక ఎత్తేస్తారా అనే దానిపై కేంద్రం నుంచి ఎటువంటి సంకేతాలూ లేక పోవడంతో కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తునారు.

అయితే దీని పై స్పందించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు. అయితే పలు రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల కరోనా తీవ్రత దృష్ట్యా ఈ లాక్ డౌన్ కొన్నిరోజులపాటు పొడిగించాలని కోరినట్లు తెలిపారు.

త్వరలో అన్ని రాష్ట్రాల సీఎం లు నివేదిక మోడీ కి అందించిన తరుపాత ఫైనల్ డెసిసన్ తీసుకుంటారని అన్నారు. ఇలాంటి సమయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని అవి త్వరలోనే సమసిపోతాయని అన్నారు. పేద ప్రజలను ఆదుకోవడానికి కేంద్ర అన్ని చర్యలూ తీసుకుందని వలస కూలీలపై ప్రతేక ద్రుష్టి సారించామని అన్నారు.

కరోనా తీవ్రతను బట్టి రెండుగా విడగొట్టమని, కరోనా పాజిటివ్ ఉన్నవాళ్ళను కేర్ సెంటర్స్ కు తరలిస్తున్నమని కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నవాళ్ళను ప్రత్యెక ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.