గురువారం, జూన్ 8, 2023
Homeక్రీడలురోహిత్ ని చూస్తె నాకు అలా అనిపించింది

రోహిత్ ని చూస్తె నాకు అలా అనిపించింది

టీం ఇండియా లో హిట్ మేన్ రోహిత్ శర్మ అంటే హాట్ ప్లేయర్.. ఒక్కసారి క్రీజ్ లోకి దిగాడంటే సిక్సర్ల మోత మోగాల్సిందే ప్రత్యర్థికి రోహిత్ క్రీజ్ లో ఉన్నంతసేపు దడ పుడుతూనే ఉంటుంది. అయితే రోహిత్ శర్మని టీం ఇండియా లోకి వచ్చిన కొత్తలో చూస్తే పాకిస్థాన్ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ లా అనిపించిందని యువరాజ్ సింగ్ అన్నాడు.

బౌలర్ లని ఎదుర్కొనేటప్పుడు రోహిత్ ఇంజమామ్ స్టైల్ లో బ్యాటింగ్ చేస్తాడన్నాడు యువి. యూట్యూబ్ చాట్ లో యువరాజ్ ను క్రికెట్ అభిమానులు రోహిత్ ని టీం లోకి వచ్చిన కొత్తలో చూసినప్పుడు మీకేం అనిపించింది అంటూ యువీని అడిగిన ప్రశ్నకు తాను ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.

రోహిత్ టీం లోకి వచ్చినప్పటి నుంచి అతని ఆట చుసిన అందరికీ అతను స్టార్ బాట్స్మన్ అవుతాడని యువి సమాధానమిచ్చాడు. ఇక రోహిత్ 32 టెస్ట్ లు, 108 టి20 లు 224 వన్డేలు ఆడాడు. రోహిత్ తొలిసారి 2007 లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు, కొన్ని టి20 ల్లో ఆడినప్పటికీ సుదీర్ఘమైన మ్యాచ్ లు ఆడటానికి 6 సంవత్సరాల తర్వాతే అవకాశం దక్కింది. ఇక 2013 లో వెస్టిండీస్ మీద తొలి టెస్ట్ ఆడాడు రోహిత్.

RELATED ARTICLES

Most Popular