రాజస్థాన్ సరిహద్దుల్లో పాక్ బలగాల మోహరింపు | India pakistan news

0
249
India pakistan news
India pakistan news

India pakistan news : దాయాది దేశం పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది సహద్దుల్లోకి భారీగా ఆయుధాలను మరియు భలగాలను తరలిస్తోంది ఇందుకు పాకిస్తాన్ కి మిత్రదేసమైన చైనాసాయమందిస్తుంది. రాజస్థాన్ సరిహద్దుల వెంబడి పాక్ భారీగా ఆయుధ నిల్వలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బిఎస్ ఎఫ్) హోమ్ శాఖకు నివేదిక అందించింది. రాత్రి యుద్ధం చేస్తే అవసరమయ్యే యాంటీ-నైట్ విజన్ జాకెట్లను చైనా ఐఎస్ఐకి అందజేసినట్లు గుర్తించామని ఆ నివేదికలో తెలిపింది.

అంతర్జాతీయ సరిహద్దులో భద్రతా సంబంధ సామాగ్రీ, ఆయుధాలు పరికరాలు, హెలిపడ్లు, నిర్మాణం వంటి కార్యక్రమాలను పెంచిందని నివేదికలో వెల్లడించింది.జై సల్మేర్ నుంచి రహీం యార్ ఖాన్ వరకు రెండు ఆయుధాల డిపోలను ఏర్పాటు చేసిందని తెలిపింది . మరో రిపోర్ట్ ప్రకారం భరత్-పాక్ సరిహద్దుల్లో ఐఎస్ఐ థర్మల్ ఇమేజింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది దీనిని బోల్తా కొట్టించేందుకు ఇతర ఏర్పాట్లను కూడా చేస్తుంది.

సరిహద్దుల్లో చొరబాట్లకు ప్రయత్నించే ఉగ్రవాదులకు చైనా నుంచి దిగుమతి చేసుకున్న థర్మల్ జాకెట్లను అందచేసింది. వీటితో ఉగ్రవాదులు సునాయాసగా సరిహద్దులను దాటగలుగుతున్నారు.
అలాగే సరిహద్దుల్లో గస్తీ కాసే పాక్ సైన్యంలోని కొన్ని ప్రత్యెక యూనిట్లకు కూడా ఐఎస్ఐ యాంటీ ధర్మల్ జాకెట్లను సరఫరా చేసింది ఇవి ధరిస్తే నైట్ విజన్ గ్లాసెస్ ద్వారా కదలికలను గుర్తించడం దాదాపు అసాద్యం కొన్ని నెలల క్రితం పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల్లో కాల్పుల విరమణను ఉల్లంగిస్తూ బిఎస్ఎఫ్ క్యాoప్ పై అతి సమీపం నుంచి కాల్పులు జరిపింది.

పాక్ రేoజర్లను బిఎస్ఎఫ్ దళాలు తమ నైట్ విజన్ సామగ్రితో గుర్తించలేక పోయారు ఆ వీడియోని జాగ్రత్తగా పరిశీలిస్తే పాక్ సైనికులు యంటీధర్మల్ జాకెట్లు ధరించి వచ్చినట్లు గుర్తించారుఇటీవల సరిహద్దుల్లో పాక్ సవ్వింపు చర్యలు నిఘా సంస్థల తాజా నివేదికతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి