రఘురామకృష్ణం రాజు పై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

0
276
రఘురామకృష్ణం రాజు
రఘురామకృష్ణం రాజు

గత కొన్నాళ్ళుగా వైసీపీ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు తన సొంత పార్టీ పైనే పలు విమర్సనాస్త్రాలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే. తనకు పార్టీలో గౌరవం లేదని, ఒక వార్డు మెంబర్ కి ఉన్న పవర్ కూడా తమకు లేకుండా తమ చేతికి సంకెళ్లు వేసారని తనకు జగన్ పై పూర్తి నమ్మకం ఉందనీ ఆ పార్టీలో ఉన్న కొందరు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

అయితే గత కొద్ది రోజులుగా వైసీపీ ఎమ్మెల్యేలు  రఘురామ కృష్ణం రాజు పై మూకుమ్మడి దాడికి దిగటం, కొంత మంది వైసీపీ పార్టీ కార్యకర్తలు ఫోన్ చేసి నువ్వు నియోజకవర్గంలోకి ఎలా తిరుగుతావో చూస్తామంటూ బెదిరించడంతో సదరు ఫోన్ కాల్ రికార్డింగ్ మరియు పార్టీ కార్యకర్తల ప్రవర్తనపై స్పీకర్, కేంద్ర హోం శాఖామంత్రికి పిర్యాదు చేయడంతో పార్టీ పరువు పోతుందనే ఇద్దేసంతో  క్రమసిక్షణా చర్యల్లో బాగంగా ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసారు.

ఈ షోకాజ్ నోటీస్ పై నేడు ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రఘురామ కృష్ణం రాజుకు వైసీపీ పార్టీ చాలా గౌరవం ఇచ్చిందన్నారు. పార్టీ క్రమశిక్షణా చర్యల్లో బాగంగా ఈ నోటీసులు ఇచ్చామని పార్టీ క్రమశిక్షణ ఉల్లంగిస్తే ఎంత పెద్ద వారికైనా చర్యలు తప్పవన్నారు. పది నుండి పదిహేను రోజులలోపు ఆయన దీనిపై సమాదానం ఇస్తారని, ఆయన ఇచ్చిన సమాదానం ప్రకారం తదుపరి చర్యలుంటాయన్నారు. అయితే రఘురామకృష్ణం రాజుకి ఆ పదవి వైసీపీ గుర్తు మరియు జగన్ ఫోటో వల్లె వచ్చిందని గుర్తుపట్టుకోవాలని అన్నారు.