శనివారం, జూలై 20, 2024
Homeటెక్నాలజీమొదలైన జియో గిగా ఫైబర్ - Jio Giga Fiber Registration

మొదలైన జియో గిగా ఫైబర్ – Jio Giga Fiber Registration

Jio Giga Fiber Registration సంచలనాల రిలయన్స్  జియో నుంచి మరోసంచలన సర్వీసు ప్రరంభం కాబోతోంది. జియో గిగా ఫైబర్ హైస్పీడు బ్రాడ్బ్యాండ్ లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ప్రారంభమయ్యాయి .

కస్టమర్లకు 1 జిబిపిఎస్ వరకు స్పీడ్ లక్ష్యంగా పెట్టుకుంది కస్టమర్లు ప్రస్తతం రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది, ఏ ప్రాంతం నుండి ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ముందు ఆ ప్రాంతంలో గిగా ఫైబర్ సేవలను సంస్థ ప్రరంబించనుంది.

దేశవ్యాప్తంగా 1000 నగరాల్లో గిగా ఫైబర్ సేవలు ప్రారంబించనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ను పరీశిస్తున్నారు. దీనిని వాడుతున్న యూజర్లు 700 ఎంబిపిఎస్ వరకు స్పీడు వసున్నట్లు చెప్పారు.

 

Jio Giga Fiber Registration Prosess

జియో అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి అందులో గిగా ఫైబర్ పేజి ఓపెన్ చెయ్యాలి అక్కడున్న చేంజ్ బటన్ పై నొక్కి మీ అడ్రెస్ ఎంటర్ చెయ్యాలి ఆతర్వాత సబ్మిట్ బటన్ నొక్కితే డిఫాల్ట్ అడ్రెస్స్ ను చూపిస్తుంది ఇది మీ ఇంటి అడ్రేస్సా కాదా అన్నది ఎంచుకోవాలి.

ఆ తర్వాతి పేజిలో మీ పేరు మరియు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటిపి బటన్ నొక్కండి మీ మొబైల్ కి వచ్చిన ఓటిపిఎంటర్ చేసి మీ లోకాలిటీసెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టాలి అక్కడితో జియో గిగా ఫైబర్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular