Tuesday, October 20, 2020
Home రాజకీయం ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం నుండి తప్పుకోవడంలో రాజకీయ కోణం ఉందా

ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం నుండి తప్పుకోవడంలో రాజకీయ కోణం ఉందా

కాపు ఉద్యమ నాయకుడు మరియు ఒకప్పటి మాజీ మంత్రి సుమారు రెండు దశాబ్దాలుగా కాపు రిజర్వెషన్ సాధనకు ఎంతగానో కృషి చేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం తాజాగా తాను కాపు ఉద్యమం నుండి తప్పుకుంటున్నట్లు తీసుకున్న నిర్ణయంతో కాపు సామాజిక నేతలు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. తాను రాసిన లెటర్లో తనపై సోషల్ మీడియాలో తనను కాపు కులద్రోహి, గజ దొంగ అంటూ విమర్శలు చేస్తునారని ఆయన ఆవేదన వ్యక్తపరుస్తూ లేఖలో పేర్కొన్నారు. అయితే కొంతమంది మాత్రం ముద్రగడ చంద్రబాబు హయాంలో మాత్రమె ఉద్యమాలు చేసారని జగన్ వచ్చాక ఎలాంటి ఉద్యనాలు చెయ్యలేదని పూర్తిగా ఆ విషయాన్నే పక్కన పెట్టేసారని విమర్శిస్తున్నారు.

రెండు దశాబ్దాలుగా అంత పెద్ద స్థాయిలో ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లకే ఎలా ఉద్యమం నుండి తప్పుకున్న్నారనే అనుమానం రాక మానదు. ఇక కాపు రిజర్వేషన్ సాదించలేమనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలూ వస్తున్నాయి. ఒకప్పుడు తుని ఘటన సమయంలో అత్యంత ఉదృతంగా సాగిన ఉద్యమం ఇప్పుడు ఒక్క సారిగా తప్పుకోవడం అనేక అనుమానాలను కలగజేస్తుంది. ప్రస్తుతం ఈ ఉద్యమం ఎలా కొనసాగించాలో అనే అయోమయంలో కాపు నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై టీడీపీ నాయకులు బొండా ఉమ స్పందిస్తూ సపందిస్తూ కాపుల అభున్నతికి తప్పకుండా ముందుకు తీసుకు వెల్తామన్నారు.       

Most Popular