అభిమానులకు కోహ్లీ బావోద్వేగ సందేశం
లండన్: ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో పరాజయాన్ని చవిచూసిన భారత జట్టు ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ బావోద్వేగంతో స్పందించాడు. జట్టుపై ఉంచిన నమ్మకాని కోల్పోవద్దని అభిమానులను కోరాడు కొన్ని మ్యాచుల్లో విజయాలు సాదిస్తాం. అలాగే కొన్నిసార్లు ఓటముల నుంచి గుణపాటం నేర్చుకుంటాం.
కాని మీరెప్పుడూ మాపై ఉంచిన నమ్మకాన్ని కోల్పోవద్దు. అలాగే మేం కూడా మీ అంచనాలను వమ్ము చేయమని వాగ్దానం ఇస్తున్నాం . అందరికీ గెలుపోటములు సహజమే అని కోహ్లీ తన పేస్ బుక్ లో పోస్ట్ చేసాడు ,ఇదు టెస్టుల సిరీస్ లో భారత జట్టు ఇప్పటికే 0-2తో వెనకడుగులో ఉంది మూడో టెస్టు 18 నుంచి నాటింగ్ హోమ్ లో జరుగుతుంది.
WhatsApp Group
Join Now