శుక్రవారం, మార్చి 29, 2024
Homeజాతీయంభారత్ పై మళ్ళీ వక్రబుద్ధి చూపించిన చైనా

భారత్ పై మళ్ళీ వక్రబుద్ధి చూపించిన చైనా

అవకాశం దొరికినప్పుడల్లా భారత్ పై తన అక్కసు వేల్లగక్కుతున్న డ్రాగన్ కంట్రీ చైనా తాజాగా భారత్ ప్రయత్నానికి మళ్ళీ అడ్డుతగిలింది. పటాన్ కోట్ ఉగ్రదాడి ప్రధాన సూత్రదారుడు జైషే-ఇ-మహమ్మద్ అధీనేత మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పరిగణిస్తూ అతనిపై నిషేధం విధించాలని కోరుతూ భారత్ ఐక్యరాజ్య సమితి ముందు కొన్నేళ్లుగా తమ వాదనలను నినిపిస్తుంది.

అయితే తాజాగా చైనా భారత్ చేసిన ఈ వాదనలకు నోచెప్పింది. మసూద్ ఉగ్రవాది అనేందుకు తమవద్ద సరైన ఆధారాలు లేవని డ్రాగన్ పేర్కొంది.

భారత్ కు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, దేశాలు మద్దతు పలికాయి. కాని వీటో అధికారం కలిగిన దేశాలలో చైనా కూడా ఉండటం వలన ఉగ్రవాది మసూద్ ను వెనకేసుకొస్తూ భారత్ చేస్తున్న ప్రయత్నాలకు కొన్నేళ్లుగా అడ్డుతగులుతూనే ఉంది. ఈ సందర్భంగా చైనా విదేశాంగ శాకా మంత్రి వాంగ్ మాట్లాడుతూ అన్నిదేశాలు ఎకాబిప్రాయంతో వస్తే మేము దానికి మద్దతిస్తామని అన్నారు.

సరైన ఆధారాలు లేకుండా ఓ వ్యక్తిన ఉగ్రవాదని నిషేదిoచలేమని వాంగ్ యీ వెల్లడించారు. భారత్ తో మాకు సత్సంభందాలు ఉన్నయంటూనే పాక్ ను వెనుకేసుకోచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ పోరాటం చేస్తుందని డ్రాగన్ పాక్ ని అభినందిoచింది.

పటాన్ కోట్ దాడిలో దాదాపు 17మంది సైనికులను పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడికి సూత్రదారి మసూద్ కారణం అందుకే అతనిని ఉగ్రవాదిగా గుర్తించి అతనిపై నిషేధం విధించాలని భారత్ 2ఏళ్ల క్రితం నుండి ప్రయాత్నిస్తూనే ఉంది.

గత జనవరిలో అమెరికా మసూద్ కి వ్యతిరేకంగా ప్రతిపాదన ప్రవేశపెట్టగా దానికి కొన్ని సాంకేతిక కారణాలు చూపిస్తూ డ్రాగన్ దానిని పక్కన పెట్టేసింది. మసూద్ అజహర్ కు  చెందిన ఉగ్రవాద సంస్థ జైషే-ఇ –అహ్మద్ పై ఐక్యరాజ్యసమితి నిషేదించిన జాబితాలో ఉంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular