Saturday, July 4, 2020
Home జాతీయం భారతీయుల జీవన విధానమే గొప్ప .. కరోనా పై ఆశక్తికర కథనం.

భారతీయుల జీవన విధానమే గొప్ప .. కరోనా పై ఆశక్తికర కథనం.

మన భారతీయుల జీవన విధానమే మనకు రక్ష. ఇతరదేశాల్లో, యూఎస్ ఏ లాంటి దేశాల్లో  వారి అతి శుభ్రతే కొంప ముంచింది. భారత దేశపు అలవాట్లే వాళ్లకు శ్రీరామ రక్ష  అన్నారు అమెరికాలో  వైరాలజిస్టు డా.ఎమ్.ఎస్.రెడ్డి కరోనా శరవేగంగా విస్తరించడానికి  అసలు ఈ వైరస్ కు కారణమైన సార్స్ కోవ్ -2 ఆర్.ఎన్.ఏ కొంచెం విభిన్నం. కరోనా చుట్టూ కొమ్ములు వంటి ఆకారాలు ఉండటంతో జీవకణాలకు ఇది బలంగా అతుక్కుంటుంది. ఈ వైరస్ కి లోపల 10 జీన్స్ ఉన్నాయి.

ఈ వైరస్ మానవకణాన్ని అతుక్కున్న వెంటనే దాన్ని చంపేసి లోపల విస్తరిస్తుంది. ఇది ఒక చిన్న స్పర్శకే వ్యాపిస్తుంది. అందువల్లే ఇంతలా వేగంగా విస్తరించింది. మన అలవాట్లపై ఇతర దేశాలవాళ్ళు చిన్నచూపు చూస్తారు కానీ భారతదేశపు అలవాట్లే భారతీయులను కాపాడుతున్నాయి. చేతులతో ఆహారాన్ని తినడం, బయట ఆడుకోవడంతో మన రోగ నిరోధక శక్తి పెరిగింది. భారతీయ జీవన విధానంలోనే కరోనా నుంచి బయటపడే  పరిష్కారముంది. మనం భోజనానికి ముందు, తర్వాత చేతులు కడుక్కుంటాం, చెప్పులతో ఇంట్లోకి రానివ్వం. ఇవన్నీ వైరస్ ను దూరం పెట్టేవే.

మనం ఎక్కువగా పసుపు, వెల్లుల్లి, లవంగాలను వంటల్లో వాడతాం. ఇవన్నీ యాంటీ వైరల్. మనం తీసుకునే మజ్జిగ, పెరుగు జీర్ణకోశంలో ప్రో బయాటిక్స్ ను తయారు చేస్తాయి. వీటి ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక వైరస్ లు రాకుండా ముందు జాగ్రత్తగా వాడే మందులు సైతం ఉన్నాయి. విటమిన్లూ వాడుతున్నాం. వైరస్ లోని జీవపదార్థం మన కణజాలంలోకి వెళ్లకుండా ఆపే మందులు ఉన్నాయి.

ఇక భారతీయుల్లో సహజంగా ఉండే యాంటీబాడీలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని అవి కరోనాను ఎదుర్కొంటాయని, అందుకే దానిగురించి అంతగా  భయపడాల్సిన పనిలేదని ప్రవాసాంధ్రులు, వైరాలజిస్ట్ , అమెరికాలో వ్యాపారవేత్త డా.ఎమ్.ఎస్.రెడ్డి అంటున్నారు. అమెరికాలో డా.ఎమ్.ఎస్.రెడ్డిగా ప్రసిద్ధి చెందిన డా.మలిరెడ్డి శ్రీనివాసులురెడ్డిది నెల్లూరు జిల్లా ఉప్పలపాడు. ఆయన భారత్ నుంచి అమెరికా వెళ్లిన తొలితరం వ్యక్తి. అమెరికాలో  మైక్రోబయాలజీలో ఎమ్మెస్ , వైరాలజీలో పీహెచ్ డీ చేశారు.

అమెరికాలో ఇంటర్నేషనల్ మీడియా అండ్ క్లస్టర్స్  డెయిరీ ఉత్పత్తుల సంస్థను స్థాపించి, ఈ రంగంలో  ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఎదిగారు, దాన్ని తీర్చి దిద్దారు. ఈ సంస్థ పాల ఉత్పత్తుల నిల్వకు సంబంధించి ఉపయోగపడేలా స్వయంగా పలు వైరస్ లను అభివృద్ధి చేశారు.

కరోనా వైరస్ లో ఎక్కువ శాతం కొవ్వు పదార్థమే ఉంటుంది. కాబట్టి ఇది సబ్బుతో చేతులు కడుక్కుంటే పోతుంది. 80% మంది కరోనా నుంచి ఇలాగే రక్షణ పొందుతారు. ఇక 15% మందిలో ఈ వైరస్ నోరు, ముక్కు ద్వారా ఊపరితిత్తుల వరకూ వ్యాపిస్తుంది. వెంటనే మన రోగ నిరోధక వ్యవస్థ ఉత్తేజితమై వైరస్ తో పోరాడుతుంది. అప్పుడు మనకు దగ్గు, జలుబు వస్తాయి.

కొందరిలో అంటే ఒక 5% మందిలో  ఈ వైరస్ ప్రమాదకరంగా తయారవుతుంది. దీనికి కారణం వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమేనట. ఈ కరోనా వైరస్ చాలా తెలివైంది. ఇది వ్యాపించిన తరువాత సురక్షిత భాగాన్ని చూసుకుంటుంది అందుకే ఊపిరితిత్తుల అడుగుభాగానికి చేరిపోతోంది. ఈ నేపథ్యంలో  ఊపిరితిత్తుల రక్షణకు విడుదలయ్యే సబ్బు లాంటి పదార్ధాన్ని విడుదలవకుండా అడ్డుకుంటుంది. అందుకే దీనివల్లే  ఊపిరిత్తుల్లో ద్రవాలు పెరిగిపోయి ఈ వైరస్ సోకిన వాళ్లలో శ్వాస సమస్య వస్తుంది. ఒక్కో సమయంలో ప్రాణాలూ పోవచ్చు.

మొత్తంగా చుస్తే ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికి పైగా అమెరికా, యూరోప్ లోని కొన్ని దేశాల్లోనే ఉన్నాయి. అక్కడ ఈ కరోనా వైరస్ విజృంభించడానికి వేరే కారణాలున్నాయి. దాదాపు 130 కోట్ల జనాభా ఉన్న భారత్ లో మాత్రం ఈ వైరస్ కేసుల సంఖ్య తక్కువుగా ఉండటాన్ని బట్టి చూస్తే ఇది అందరిపై ఒకేలాంటి ప్రభావాన్ని చూపడం లేదని అర్థమవుతుంది. పాశ్చత్య దేశాల్లో ప్రజల అతి శుభ్రతే  అక్కడ కరోనావల్ల జరుగుతున్న అనర్థానికి కారణం. భారత్ లో అపరిశుభ్రతతో సాల్మనెల్లా, డయేరియా వంటివి రోగాలు వస్తాయి. వాటికి యాంటీ బ్యాక్టీరియల్ మందులు వాడుతుంటాం అవి సరిపోతాయి. కానీ అమెరికన్లు బ్యాక్టీరియా లేని ఆహారం ఎక్కువగా తీసుకోవడంతో సమస్యలు వస్తున్నాయి. అమెరికాలో వారు తినే ఆహారం శుద్ధి చేసిన ఆహారం దాంట్లో ఒక గ్రాముకు 10 నుంచి 100 బ్యాక్టీరియాలు కూడా ఉండవు. కానీ భారత్ లో లక్షలు, కోట్లు, మిలియన్లలో బాక్టీరియాలు ఉంటాయి. అలా లేకపోతే మనం తినే  ఆహారంలో బ్యాక్టీరియాలు లేకపోతే మన రోగనిరోధక వ్యవస్థ శత్రువును ఎదుర్కొనే స్థాయిలో వృద్ధి చెందదు.

మన దగ్గర అంటే భారత్ లో చిన్నప్పటి నుంచి మట్టిలో, వీధుల్లో ఆడుతుంటాం. ఎన్నో బ్యాక్టీరియాల దాడికి గురవుతుంటాం. 13 ఏళ్లు వయసు వచ్చే నాటికే మన పిల్లలపై సుమారు ఆరు కోట్ల బ్యాక్టీరియా, వైరస్ లు దాడి చేస్తాయి. దీంతో వాళ్లలో సహజంగానే శరీరం యాంటీబాడీస్ ను ఉత్పత్తి చేసుకుంటుంది. ఇవన్నీ మెమరీలో నిక్షిప్తమవుతాయి. మళ్లీ ఎప్పుడైనా అలాంటి వైరస్ వాళ్లపై దాడి చేస్తే క్షణకాలంలోనే ఈ యాంటీబాడీలు అలర్ట్ అయ్యి  వైరస్ ను కట్టడిచేస్తాయి. కొత్త వైరస్ లో కొత్త జీనోమ్ వచ్చినా మనలో తయారైన  ఈ యాంటీబాడీస్ నిలువరిస్తాయని ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వూలో అన్నారు  అమెరికాలో ఉండే ప్రముఖ వైరాలజిస్టు డా.ఎమ్ .ఎస్ .రెడ్డి.

ప్రజావారధిhttps://www.prajavaradhi.com/
పాటకులకు ముఖ్య్యంగా తెలుగు ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఉండాలని రూపొందించిన వెబ్ సైట్ ప్రజావారధి డాట్ కాం. గత కొంతకాలంగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఘణనీయంగా తగ్గిపోతుంది కావున మళ్ళీ తెలుగుకు పూర్వవైభవం రావాలనే ఆశతో మా ఈ చిన్న ప్రయత్నం. ఇందులో తెలుగు ప్రజలకు ఉపయోగపడే ముఖ్య సమాచారంతో పాటు రాజకీయ వార్తలు, దేశ, విదేశీ వార్తలు మీ ముందుకు తీసుకువస్తున్నాం. ప్రతీ మనిషికీ ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే హెల్త్ టిప్స్ మరియు క్రీడావార్తలు అన్నివయస్సుల వారికీ ఉపయోగపడే భక్తి సమాచారం ఈ వెబ్ సైట్ మీకు అందిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ప్రముఖ బాలివుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ (71)ఇకలేరు. గుండె పోటుతో శుక్రవారం తెల్లవారజామున కన్నుమూశారు. 15 రోజుల క్రితం అనారోగ్యానికి గురైనా కారణంగా జూన్ 20 నీ ముంబయి లోని బాండ్రాలోని గురునానక్ ఆసుపత్రిలో...

జగన్నాథ రథయాత్ర కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్-Puri Jagannath Rath Yatra

ఒడిశాలోని జరిగే పురి జగన్నాథుని రథయాత్ర కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కొన్ని రోజుల క్రితం ఆలయ రథయాత్ర నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇప్పుడు కొన్ని నిబంధనలతో రథయాత్ర జరుపుకోవచ్చని...

భారత ఆర్మీలోని హిందూ-సిఖ్ జవాన్ల పై పాకిస్థాన్ సోషల్ మీడియాలో కుట్రలు

భారత్ ఒకవైపు చైనాతో బోర్డర్ లో పోరాడుతుంటే మరోవైపు పాకిస్థాన్ వెనకనుండి దొంగ దెబ్బ తీయడానికి ఉగ్రవాదులను సరిహద్దులు దాటిస్తుంది. తాజాగా భారత్ –చైనా దేశాల మద్య బోర్డర్ లో ఉద్రిక్తతలు మొదైలైన...

కరోనా తో మరణించిన వ్యక్తిని జేసీబీ లో తీసుకెళ్ళిన ఘటన

కరోనా మహమ్మారి దెబ్బకు కరోనా సోకిన వారిని వారు బంధువులైనా మరెవరైనా సరే వారిని దూరం పెట్టిన ఘటనలు చాలానే చూసాం. అయితే శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇలాంటి ఘటనే జరిగింది. అయితే...

Recent Comments