ఆదివారం, ఫిబ్రవరి 5, 2023
Homeసినిమాబీట్స్ ఆఫ్ రాదేశ్యామ్ .... సర్‌ప్రైజ్ విజువల్ వండర్ Beats Of Radhe Shyam

బీట్స్ ఆఫ్ రాదేశ్యామ్ …. సర్‌ప్రైజ్ విజువల్ వండర్ Beats Of Radhe Shyam

Beats Of Radhe Shyam : రెబల్ స్టార్ ప్రభాస్ జిల్ ప్రేమ రాధాకృష్ణ డైరెక్షన్ లో యూవీ క్రియేషన్, గోపీకృష్ణ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ మూవీకి సబంధించిన బీట్స్ ను చిత్ర యూనిట్ నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసారు.

అయితే గత కొద్దిరోజులుగా రాదే శ్యామ్  నుండి ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో యూవీ క్రియేషన్ పై ట్విట్టర్ లో దాడికి దిగారు. అయినా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఆర్తనాదాలు యూవీ క్రేయేషన్స్ వారికి పెద్దగా వినిపించినట్లు లేవు.

అయితే నేడు ప్రభాస్ పుట్టినరిజు కానుకగా విడుదల చేసిన “బీట్స్ ఆఫ్ రాదేశ్యామ్” తో ఫ్యాన్స్ కు కళ్ళు చెదిరే రీతిలో సినిమాను ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. అరచేతిలో అడవి మధ్యలోంచి వెళ్తున్న రైలులో సలీమ్- అనార్కలి, రోమియో-జూలియెట్, దేవదాస్-అనార్కలి వంటి ప్రమికులను గ్రాఫిక్ రూపంలో చూపిస్తూ ప్రభాస్-పూజా హెగ్డే ఇద్దరూ ట్రైన్ నుండి బయటకు వేలాడుతున్న సీన్ ను అద్భుతంగా తెరకెక్కించారు.

అయితే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన చిన్న బీట్ లోనే అద్భుతమైన గ్రాఫిక్స్, ఆర్ట్ వర్క్ తో ప్రేక్సకులకు మంచి బర్త్డే ట్రీట్ ఇచ్చాడు డార్లింగ్ ప్రభాస్. తక్కువ నిడివి గల ఈ చిన్నబీట్స్ కి ఇప్పటికే నాలుగు గంటలలో 12 లక్షల వ్యూస్ 1లక్షా 75వేల లైక్స్ తో యూట్యూబ్ లో సునామీ సృష్టిస్తుంది. లవ్ ఎంటర్టైనర్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కి కొద్దిగా లోటు ఉన్నా ఈ సినిమా దియేటర్లలోకి ఫ్యామిలీ మొత్తాన్ని రప్పిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

ఎలా చూసినా ప్రభాస్ తన పాత రికార్డులను తనే బ్రేక్ చేసే చాన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఈ సినిమాతో పాన్ వరల్డ్ స్టార్ గా ఎదుగుతాడని అనడంలో సందేహం లేదు. ఏదేమైనా తెలుగు వారి కీర్తి ప్రతిష్టలు నలువైపులా విస్తరిస్తున్న నీకు ప్రజావారధి తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు…      

RELATED ARTICLES

Most Popular