ఆదివారం, నవంబర్ 27, 2022
Homeజాతీయంజయహో మోడీ .. దేశం నిన్ను చూసి గర్విస్తుంది

జయహో మోడీ .. దేశం నిన్ను చూసి గర్విస్తుంది

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి దెబ్బకి గజగజలాడిపోతోంది.  ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పరిస్థితి చేజారిపోకూడదని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచదేశాల మన్ననలు పొందుతోంది.  భారత్ త్వరగా ముందు జాగ్రత్త తో మసులుకోవడంతో అనుకున్నంత పెద్దగా మహమ్మారి వ్యాపించలేదని మోడీ సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకోవడమే ఈ ఫలితానికి కారణమని అగ్రరాజ్యం కూడా అంటోంది..

ఇక మనదేశ ప్రజలు కూడా మోడీ ఇచ్చిన సూచనలను ప్రజలను సంఘటితం చేస్తూ ఒక్కతాటి పైకి తెచ్చేకార్యక్రమాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. వీటికి ఉదాహరణ మొన్న జరిగిన దీపాలు వెలిగించే కార్యక్రమం, అలాగే చప్పట్లు కొడుతూ కరోనాపై పోరాడుతున్న డాక్టర్స్ కి అలాగే సేవలు అందిస్తున్న వారికీ కృతజ్ఞత తెలిపే కార్యక్రమం ఇవన్నీ కేవలం మోడీ ఒక్క పిలుపుతోనే సాధ్యమయ్యాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు..

అయితే రాహుల్ గాందీ మాత్రం మోడీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోక పోగా మోడీ పై విమర్శనాస్త్రాలు సందించారు. మోడీ దీపాలు వెలిగిస్తేనో లేక చప్పట్లు కొడితేనో వైరస్ తగ్గదని దుయ్యబట్టారు. “కరోనా యాంటీ వైరస్ డోస్” తయారు చేయడంలో ప్రభుత్వం, సైంటిస్టులు దీని పై జాప్యం చేస్తునారన్నారు.

ఈ విషయం పై కొందరు సోషల్ మీడియాలో రాహుల్ కి కౌంటర్ గా “కరోనా యాంటీ వైరస్ డోస్” అనేది చాక్లెట్ కాదని వెంటనే తయారు చేయడానికి. దీనికి 6నెలల నుండి సంవత్సరం దాకా పడుతుందని ఈ విషయం రాహుల్ కి తెలియదా అని కౌంటర్ ఇచ్చారు.

ఇక అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లాక్ డౌన్ మంచి ఫలితాలను ఇచ్చిందని కాబట్టి దీన్ని పొడిగించాలని కోరుతున్నారు దేశ చరిత్రలో ఇది భారతీయులుగా అందరూ గర్వించదగ్గ విషయం ఎందుకంటే ప్రజల క్షేమం కోసం ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా ప్రజల శ్రేయస్సు కోరుకుంటూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాటించడం అనేది ఐక్యతకు చిహ్నం అలాగే  భారతదేశానికి కష్టం వస్తే భారతీయులమంతా ఒక్కటే అని చెప్పకనే చెప్పే సమయం..

ఇక ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ 21 రోజుల లాక్ డౌన్ ని పొడిగిస్తారా లేక మరేమైనా కొత్త ఆలోచనలో ఉన్నారా అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. నిజాముద్దీన్ ఘటన జరగకుండా ఉండుంటే దేశంలో ఇన్ని కేసులు ఉండేవి కావంటూ నిపుణులు కూడా వెల్లడించారు.

ఇక ఇలాంటి తరుణంలో అసలు ఇంకా ఎన్ని కేసులు ట్రేస్ చేయాల్సి ఉంది. ఎంతమంది బాధితులు ఇంకా ఉన్నారు అనేది ఇప్పటికి సవాల్ గానే కనిపిస్తోంది. మరోవైపు నిజాముద్దీన్ ప్రార్థనల్లో పాల్గొన్న వారు ఎవరైనా ఉంటే బయటకి స్వచ్చందంగా వస్తే అందరికి మేలుజరుగుతుంది ప్రభుత్వాలు కూడా పదేపదే

RELATED ARTICLES

Most Popular