ఎప్పుడూ ఏదో వివాదంతో ముందుడే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ క్కర్మిక సంఘ నాయకుడిని కొట్టడమే కాక తన అనుచరులతో, భద్రతా సిబ్బందితో దాడి చేయించారనే ఆరోపనతో ఎమ్మెల్యే చింతమనేని ప్రబాకర్ పై పోలీసులు కేసు నమోదు చేసారు. ప్రజా సంఘాలు రిలే దీక్షలు చేయడంతో అన్నివైపులనుండి ఒత్తిడి పెరగడంతో పోలీసులు చిన్తమనేనిపై కేసు నమోదు చేసారు.
ఏలూరు ఐఎంఎల్ డిపోలో పనిచేస్తున్న గొర్రెల శ్యాంబాబు ఈ నెల 7న మద్యం సీసా దొంగిలించి దొరికిపోవడంతో యూనియన్ నిభంధనల ప్రకారం అతన్ని పనిలోనుంచి తొలగించారు. రాంబాబు బావమరిది చుక్క ఈశ్వరరావు అక్కడే పనిచేస్తున్నాడు అతను స్థానిక టీడీపీ నాయకుడు నేతల రవి ద్వారా తన బావను తొలగించిన విషయాన్ని ఎమ్మెల్యే చింతమనేని దృష్టికి తీసుకువెళ్ళాడు
దీంతో యూనియన్ నాయకుడు జాన్ ని ఇంటికి పిలిపించిన ఎమ్మెల్యే రాంబాబుని పనిలో పెట్టుకోవాలని ఆదేశించారు. అందుకు నిబందనలు అంగీకరించవని జాన్ నిర్మొహమాటంగా చెప్పాడు. దీనితో ఆగ్రహించిన ఎమ్మెల్యే జాన్ పై చేయి చేసుకున్నారు.
అక్కడే ఉన్న నేతలరవి తో పాటు భద్రతా సిబ్బంది కూడా అతనిపై దాడి చేసారు. దీనిపై ఏలూరు పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసారు. దీనిని పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు దీనితో ఏలూరు మూడో పట్టణ పోలీసులు గురువారం చిమ్తమనేనిపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసారు.