శుక్రవారం, మార్చి 31, 2023
Homeరాజకీయంకిడారి పై మావోలు జరిపిన దాడి గురించి డ్రైవర్ చెప్పిన షాకింగ్ నిజాలు..!

కిడారి పై మావోలు జరిపిన దాడి గురించి డ్రైవర్ చెప్పిన షాకింగ్ నిజాలు..!

విశాఖపట్నం జిల్లాలో గల అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆదివారం మావోయిస్టులు ఆయన్ను  దారుణంగా కాల్చి చంపారు. దీంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొన్నాళ్ళ క్రితం పోలీసులు మావోల ఏరివేత కొనసాగించారు దీనితో మావోల ప్రాబల్యం ఒక్కసారిగా తగ్గిపోయింది.

తాజాగా ఎమ్మెల్యేపై జరిపిన కాల్పులతో అన్ని రాజకీయ పార్టీలు ఒక్కసారిగా బెదిరిపోయాయి. ఈ ఘటనలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు  మాజీ ఎమ్మెల్యే సివేరి సోములను తుపాకులతో రౌండప్ చేసి అక్కడి నించి దూరంగా తీసుకువెళ్ళి కాల్చి చంపారని సివేరి సోము కారు డ్రైవర్ మీడియాకు వెల్లడించారు.

డ్రైవర్ చెప్పిన షాకింగ్ నిజాలు :-

మేము గ్రామసభకు వెళ్తుంటే మా కాన్వాయ్ ని మావోఇస్టులు మార్గం మధ్యలో అడ్డగించి గన్ మెన్ ల ఆయిధాలను లాక్కుని మమ్మల్ని దూరంగా తీసుకువెళ్లారు. రున్నింగ్ లో ఉన్న కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలపై కారును చుట్టుముట్టి దాడిచేసి బయటకు లాగి చేతులను వెనక్కు కట్టి అక్కడినుండి దూరంగా తీసుకు వెళ్ళినట్లు తెలిపారు.

ఈ క్రమంలో మావోఇస్టులు పారిపోతే కాల్చివేస్తామని బెదిరించారని డ్రైవర్ చిట్టిబాబు అన్నారు. కిడారి సోములపై కాల్పుల శబ్దం వినబడ్డాక తమను వదిలేశారని చిట్టిబాబు వెల్లడించారు. చివరిగా మావోలు వెళ్తూ వారెన్ని అక్రమాలు చేసారో తెలుసా అని తమను ప్రశ్నించారని, ఇటువంటివారు ప్రజలమధ్య బ్రతకకూడదని మావోలు అన్నట్లు చిట్టిబాబు వెల్లడించారు.

దీనిపై కొందరు విశ్లేషకులు స్పందిస్తూ వీరు అధికార పార్టీలోకి చేరి బాక్సైట్, ఇతర మైనింగ్ వ్యవహారాల్లో కిడారి పాత్ర పోషిస్తుండతో ఆయనను మావోలు టార్గెట్ చేసారని వార్తలు వినిపిస్తున్నాయి. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి కిడారి సర్వేశ్వరరవుకు ఇదివరుకే మావోలు హెచ్చరికలు జారీ చేసారు.

RELATED ARTICLES

Most Popular