ఈస్ట్ గోదావరి జాయింట్ కలక్టర్ టెలీ కాన్ఫరెన్స్ కీలక ఆదేశములు

0
257
East Godavari joint collecter
East Godavari joint collecter
  1. తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 6 కరోన కేసులు నమోదు అయిన నేపధ్యంలో జనాలు ఎవరు బయటకి రాకూడదు, గుంపులుగా గుమిగుడకూడదు అనే వుద్దేశ్యంతో, రేపటి నుండి రేషన్ షాప్ నుండి అన్నీ సరుకులు డోర్ డెలివేరి చేయవలెను.
  2. వాలంటీర్లు వారి యొక్క 50 ఇండ్లకు, ఇంటింటికి తిరిగి రేషన్ కార్డులు మరియు సంచులు/బాగ్ లు కలెక్ట్ చేసి రేషన్ షాప్ వద్దకు తీసుకు రావలెను. ఆ సంచుల మీద ఆ వ్యక్తుల పేర్లు మార్కర్ తో రాయవలెను. ఎవరి పేరుతో వున్న సంచి వారికే డెలివరీ చేయవలెను.
  3. రేషన్ డీలర్లు సంబంధిత తంబ్ అథెంటికేషన్ అధికారి తో తంబ్ వేయించుకొని, ముందు రోజే (ఈ రోజు నుండి) పేక్ చేయించి మరుసటి రోజు ఉదయం వాలంటీర్ ద్వారా ఆటొ/రిక్షా/ట్రాక్టర్ ఏది అందుబాటులో ఉంటే ఆ రవాణా సాధనం ద్వారా ఇంటింటికి పంపిణీ చేయవలెను. రేషన్ కార్డు దారుల ఎదురుగా తూకము వేసి ఇవ్వవలెను.
  4. తూకము విషయములో ఏ విధమైన తేడా వుండకూడదు మరియు ఏ విధమైన ఫిర్యాదు రాకూడదు. అలా వచ్చినచో కఠినమైన చర్యలు తీసుకొనబడును.
  5. రవాణా సాధనం నిమిత్తం ప్రతి వాలంటీర్ కు 400 నుండి 500 వరకు అమౌంట్ పేమెంట్ చేయబడును.
  6. రేపటి నుండి ఏ కార్డుదారుడు కూడా సరుకుల నిమిత్తం రేషన్ షాప్ వద్దకు రాకూడదు. ఈ విషయమై మీ షాప్ ల వద్ద వెంటనే బోర్డులు పెట్టవలెను.