అమెరికా పెట్టె ఆంక్షలకు మేము తలోగ్గమని ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహాని అన్నారు. ఇరాన్ పట్ల అమెరికా అనిసరిస్తున్న విధానాలపై ఆయన తీవ్రంగా ద్వజమెత్తారు. అమెరికా తమపై అవలంబిస్తున్న ఘర్షణాయుత వైకరి విఫలం కావడం కాయమని ఆయన అన్నారు. న్యూయార్క్ లో జరిగిన 73వ ఐరాసా బద్రతా మండలి సమావేశంలో రౌహాని ప్రసంగించారు.
అమెరికా తమపై ఏకపక్ష నిర్ణయాలతో మమ్మల్ని రెచ్చగొడుతుందని తద్వారా ఆర్ధిక యుద్ధం జరుపుతోందని విమర్శించారు. ఇరాన్ చమురు, బ్యాంకింగ్ రంగంపై ఈ ఏడాది నవంబరులో మరింత తీవ్రమైన ఆంక్షలు విదించే అవకాసం ఉందని తాము బావిస్తున్నమన్నారు. కొత్త ఆంక్షలతో అమెరికా ప్రారంబించిన ఆర్ధిక యుధం కేవలం ఇరాన్ నే కాక ఇతర దేశాలకు కూడా ప్రమాదకరంగా మారాయని రౌహాని విమర్సించారు.
ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తామని టర్కీ అధ్యక్షుడు ఏర్దోగాన్ వెల్లడించారు. అమెరికా తమపై ఎన్ని ఆంక్షలు పెట్టినా తలోగ్గేది లేదన్నారు. చమురుతో పాటు నేచురల్ గ్యాస్ కూడా ఇరాన్ నుండి దిగిమతి చేసుకుంటామని అన్నారు.అమెరికా మాజీ అద్యక్షుడు ఒభామా కూడా తమపై ఇలాంటి అంక్షలె విదించారని అన్నారు. రష్యా నుంచి 50 శాతం గ్యాస్ దిగుమతి చేసుకుంటున్నామన్నారు.