అడ్డంగా దొరికిన షామి | Xiaomi phone latest news

Xiaomi latest phone

న్యూఢిల్లీ: సరికొత్త ఫీచర్లతో అందరికీ అందుబాటు ధరల్లో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ భారతీయ వినియోగదారులను Xiaomi ఆకట్టుకొంటుంది తాజాగా తన వినియోగదారులను మోసంచేసే ప్రయత్నంచేసి అడ్డంగా దొరికిపోయింది.

ఇటీవల ‘పోకో ఎఫ్1’ ను విడుదల చేసింది ఆకర్షణీయమైన రంగులతో వచ్చిన ఈ ఫోన్ వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించింది. అయితే షియోమి అధికార ప్రతినిధి డోనోవాంగ్ సంగ్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫోటోను ఫోస్ట్ చేసారు అది కొత్తగా రిలీజైన ‘పోకో ఎఫ్1’ తీసినట్లుగా అందులో పేర్కొన్నారు, కెమెరా పనితీరు గురించి గొప్పగా పేర్కొన్నారు.

అక్కడే ఆయన పొరపాటు చేసారు ఆ ఫోటోలో ఓమూలాన ఉన్న లోగోను తొలగించడం మర్చిపోవడంతో ఇది ‘ఎంఐమిక్స్ 2ఎస్’ తో తీసిందని రెడిట్ యూజర్ ఒకరు కనిపెట్టారు. ఫోటోను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఓ మూలాన దాని లోగో ఉంది. దీనితో యూజర్లు ఫోటో పైన మరియు సంస్థ పైన విరుచుకుపడ్డారు దీనితో సంస్థ ప్రతినిధి ఆ ఫోటోను తన కాతా నుండి తొలగించారు.   


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి