హైదరాబాద్ : క్రికెట్ చరిత్రలో తనదైన ముద్రవేసిన లెజెండ్ క్రికెటర్ సచిన్ తనయుడు Arjun Tendulkar ముంబై అండర్-19 క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. వన్డే టోర్నమెంట్లో ముంబై తరుపున ప్రాతినిధ్యం వహించనున్నాడు.
ఈ టోర్నీ సెప్టెంబర్ 16 న ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ గుజరాత్ లోని వడోదర లో జరగనుంది ముంబై జట్టు కెప్టెన్సీ సువెద్ పార్కర్ కు ఇవ్వనున్నారు.
18 ఏళ్ల Arjun Tendulkar గత జూలైలో శ్రీలంక రాజధాని కొలంబో లోని జరిగిన మ్యాచ్ లో భారత్ అండర్ 19 జట్టు తరపున తొలిమ్యాచ్ ఆడాడు అయితే ఆ పర్యటనలో అర్జున్ టెండూల్కర్ అంతగా రాణించలేక పోయాడు.
దీనితరువాత ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ ప్రాక్టీస్ సెసన్స్ లో పాల్గొని భారత బాట్స్మెన్ కి బౌలింగ్ కూడా వేసాడు. ఎడమ చేతివాటం కావడంతో ఇంగ్లాండ్ లో అర్జున్ చేత బౌలింగ్ చేయించినట్లు భారత కోచ్ వెల్లడించారు.