Sun. Dec 9th, 2018

3 సంవత్సరాల బాలిక నోటిలో దీపావళి బాంబు పెట్టి పేల్చేసిన యువకుడు..!

3 సంవత్సరాల బాలిక నోటిలో దీపావళి బాంబు పెట్టి పేల్చేసిన యువకుడు..!

మీరట్ కు చెందిన ఓ యువకుడు దీపావళి రోజున అత్యుత్సాహం ప్రదర్శించి మూడు సంవత్సరాల బాలిక నోట్లో బాంబ్ పెట్టి కాల్చాడు దీనితో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. ఆమేను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

meerat sutili bomb blast on mouth

మీరట్ లో మిలాక్ అనే గ్రామంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బాలిక తండ్రి శశికుమార్ పిర్యాదు ఇవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికంతటికీ కారణమైన వ్యక్తి పేరు హర్ఫాల్ గా గుర్తించామని అన్నారు. తన కూతురు ఇంటి వాకిట్లో ఆడుకుంటున్న సమయంలో హర్ఫాల్ వచ్చి నోట్లో బాంబ్ పెట్టి కాల్చాడని బాలిక తండ్రి అన్నారు. బాంబు పేలి తన కూతురికి తీవ్ర రక్త స్రావంతో గాయాలైనట్లు చెప్పారు. తనకు దాదాపు 50 కుట్ల దాక పడ్డాయని ఆమె గొంతు బాంబు దాడికి ఇన్ఫెక్షన్ కు గురైందని ఇప్పటికీ నాకూతురి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *