గురువారం, ఏప్రిల్ 25, 2024
Homeరాజకీయంతెలంగాణా కానిస్టేబుల్ పరీక్షకు భారీగా హాజరైన విద్యార్ధులు

తెలంగాణా కానిస్టేబుల్ పరీక్షకు భారీగా హాజరైన విద్యార్ధులు

తెలంగాణా ప్రభుత్వం నిర్వహించిన పోలీసు నియామక మండలి ఎగ్జామ్ ను ఈ ఆదివారం పరీక్ష అంతా ప్రశాంతంగా ముగిసింది.  రాష్ట్రంలోని మొత్తం 40 ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ఈ 966 పరీక్షా కేంద్రాల్లో 4,49,584 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం పరీక్షలకు  94 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారని అధికారులు తెలిపారు.

16,925 పోస్టుల భర్తీకి ఈ సంవత్సరం మే 31 న జారీచేసిన నోటిఫికేషన్ కు అబ్యర్దుల నుంచి అత్యధికంగా స్పందన వచ్చింది. ప్రతీ పరీక్షా కేంద్రంలో అధికంగా 90 శాతానికి పైగా అభ్యర్ధులు ఈ ఎగ్జామ్ కి హాజరయ్యారు. ఈ పరీక్షను ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు ఈ పరీక్ష నిర్వహించారు.police conistable test

రాష్ట్రంలో  ఎంపిక చేసిన 40 ప్రాంతాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఇక అభ్యర్ధుల యొక్క అటెండెన్స్ ను బయోమెట్రిక్ ఆదారంగా తీసుకున్నారు. ఇక  ప్రిలిమినరీ పరీక్షకు సంబందిచిన ప్రాధమిక ‘కీ’ ని ఎగ్జామ్ నిర్వాహణా అధికారులు త్వరలోనే విడుదల చేయనున్నారు. ‘కీ’ విడుదల అనంతరం మూడురోజుల వరకూ అభ్యంతరాలకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఫైనల్ ‘కీ’ విడుదల చేస్తారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular