గురువారం, మార్చి 28, 2024
Homeజాతీయంఎస్ బీ ఐ డెబిట్ కార్డులు ఈ నెల 30 తరువాత పనిచెయ్యవు కారణం ఇదే

ఎస్ బీ ఐ డెబిట్ కార్డులు ఈ నెల 30 తరువాత పనిచెయ్యవు కారణం ఇదే

ఎస్ బీ ఐ డెబిట్ కార్డులు ఈ నెల 30 తరువాత పనిచెయ్యక పోవడానికి కారణం ఆర్.బీ.ఐ. కి సంబందించి టెక్నాలజీ పెరిగేకొద్దీ సైబర్ నేరాలు కూడా అదే విదంగా పెరుగుతున్నాయి. వీటిని అదుపు చేసేందుకు, మరిన్ని కటిన నిర్ణయాలు తీసుకునే పనిలోపడింది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఆన్ లైన్ మోసాలను అడ్డుకట్ట వేసేందుకు బ్యాంకులు కూడా గట్టి వెబ్ సెక్యూరిటీ సిస్టం మెయింటైన్ చెయ్యాలని ఆర్ బీ ఐ తెలిపింది.

బ్యాంకింగ్ వ్యవత్స తో పాటు ఆర్ బీ ఐ ప్రభుత్వ , ప్రైవేటు బ్యాంకులు టెక్నాలజీ విషయంలో కాతాదారుల సొమ్ము విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తాజాగా ఆర్ బీ ఐ నిబంధనల ప్రకారం ఏటీఎం లావాదేవీలు మరింత సిరక్షితం చేసేందుకు ఎస్ బీ ఐ మరో ముందడుగు వేయనుంది. ప్రస్తుతం ఖాతాదారులు వినియోగిన్తున్న డెబిట్ కార్డులను ఈ సంవత్సరం చివరినాటికి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే డిసెంబర్ 31 తర్వాత మ్యాగ్ స్ట్రిప్ డెబిట్ కార్డులు పనిచెయ్యవు.

దీనికి సంబంధించి ఎస్ బీ ఐ ఒక ప్రకటన కూడా చేసింది. ఇప్పుడున్న డెబిట్ కార్డుల స్థానంలో కొత్త ఈఎంవీ చిప్ కార్డులను బ్యాంకు జారీ చేయనున్నది. ఈ కార్డుల కోసం డిసెంబర్ 31 తేదీ లోగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా దరకాస్తు చేసుకోవాలని లేదా సంబంధిత బ్రాంచ్ ద్వారా దరకాస్తు చేసుకోవచ్చని బ్యాంకు అదికారులు తెలిపారు.

పాత కార్డులు పనిచేయ్యవని తెలియడంతో ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లి కొత్త కార్డులను అప్లై చేస్తున్నారు. కొత్త కార్డులు చాలా ప్రైవసీ కార్డులని వీటిద్వార ఆన్ లైన్ మోసాలను అరికట్టవచ్చని, హ్యాకర్లు మరియు ఏటీఎం లలో కార్డులను క్లోనింగ్ చేసే వాళ్ళను ఈ కార్డుల ద్వారా సులభంగా గుర్తించ వచ్చని చెబుతున్నారు. ఇంకా నాలుగు నెలలే ఉండటంతో కొత్త కార్డుల కోసం బ్యాంకులలో అత్యధికంగా అప్లికేషన్లు వస్తున్నాయి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular