గురువారం, మార్చి 28, 2024
Homeభక్తిఆన్ లైన్ లోకి వినాయకుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి వినూత్న ఆలోచన..!

ఆన్ లైన్ లోకి వినాయకుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి వినూత్న ఆలోచన..!

విఘ్నాలు నివారించే గణపతి జన్మదినమే వినాయక చవితి  ప్రతీ సంవత్సరం బాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి నాడు వినాయక చవితి పండుగను జరుపుకొంటారు వినాయక చవితి వచ్చిందంటే చాలు చిన్నపెద్దా తేడా లేకుండా పండుగను కుటుంభ సమేతంగా ఉత్సాహంగా జరుపుకుంటారు.

పంచభూతాలతో మమేకమవుతూ భక్తి, శ్రద్ధలతో నమ్మకంతో తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగాలని గణపతిని అత్యంత భక్తి, శ్రద్దలతో కొలుస్తారు. అయితే చవితిపూజకు కావలసిన పూజా సామాగ్రి దొరకక చాలామంది భక్తులు ఇబ్బందులు పడుతుంటారు.

మార్కెట్లలో ఏది అమ్మితే దానితో సరిపెట్టుకుంటారు వీరిలో కొంత మందికి అసలు ఏయే పత్రులతో పూజ చెయ్యాలి,ఎలాచేయ్యాలి వంటి విషయాలు తెలియవు దీనిని తెలుసుకున్న హైదరాబాద్ కి చెందినా కుర్రాడు ‘ఆరాధ్య’ అనే ఆన్ల్ లైన్ కంపెనీ ద్వారా ఆన్ లైన్ లోకి వినాయకుడి విగ్రహ ప్రతిమతో పాటు, 18 రకాల పూజా సామాగ్రి మరియు 21 రకాల పత్రులను ఒక ప్యాక్ ద్వారా భక్తులకు అందిచాలని సంస్థ నిర్ణయించింది.

vinaayaka chavithi vinaayaka chavithiప్రస్తుతం ఇది హైదరాబాద్ లో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇవి మొత్తం మూడు రకాల కిట్లలో అందుబాటులో ఉంటాయి మట్టితో చేసిన 9అంగుళాల విగ్రహం, 21రకాల పూజా పత్రులు, 18 రకాల పూజా సామాగ్రి మొత్తం కలిపి 999 రూ. కు అందిస్తున్నట్లు వేణుగోపాల స్వామి తెలిపారు.

499 కి ఆరు అంగుళాల ప్రతిమ అందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరవాసులకు డోర్ డెలివరీ ఉందన్నారు పికప్ లొకేషన్ కు వచ్చి సామాగ్రి తీసుకునేవారికి 50 డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు

ఈ పూజా కిట్ కావాలనుకునే వారి కోసం www.aaradhyakit.com నుండి పూజా కిట్ ను బుక్ చేసుకోవచ్చన్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular