శుక్రవారం, మార్చి 29, 2024
Homeజాతీయంభారత డీఆర్డీవోలో ఐఎస్ఐ గూడచారి కీలక సమాచారం చోరీ

భారత డీఆర్డీవోలో ఐఎస్ఐ గూడచారి కీలక సమాచారం చోరీ

  • క్షిపణి సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్న ఉద్యోగి

  • మహారాష్ట్రలో అదుపులోకి తీసుకున్న ఇంటలిజెన్స్ అధికారులు

  • పాకిస్థాన్ సహా పలు దేశాలకు సమాచారం చేరవేత

భారత్ మరియు రష్యా సంయుక్తంగా రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణి ఇది ప్రపంచంలోనే అత్యధిక వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. దీనికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కి చేరవేస్తున్న గూడచారిని అధికారులు అరెస్టు చేసారు.

నాగ్ పూర్ లోని డీఆర్డీవోలో ఉన్న ‘బ్రహ్మోస్ క్షిపణి’ పరిశోధనా కేంద్రం లో నిశాంత్ అగర్వాల్ గత నాలుగు సంవత్సరాలుగా ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు ఈ నేపధ్యంలో బ్రహ్మోస్ క్షిపణికి సబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ తో పాటు మరికొన్ని దేశాలకు నిశాంత్ చేరవేసినట్లు భారత నిఘా వర్ఘాలు గుర్తించి నిశాంత్ అగర్వాల్ ను అదుపులోకి తీసుకున్నారు.

భారత మిసైల్ సిస్టమ్ కు చెందిన కీలకమైన సాంకేతిక సమాచారాన్ని నిశాంత్ అగర్వాల్ సేకరించి ఐఎస్ఐకి లీక్ చేస్తున్నట్లు అదికారులు గుర్తించారు. దేశ రక్షణ వ్యవస్థలో కీలకంగా భావించే బ్రహ్మోస్ సాంకేతిక సమాచారాన్ని నిషాంత్ ఏమేరకు ఐఎస్ఐ కి చేరవేసాడనే దానిపై అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో మరో ఏజన్సీ పాత్ర కూడా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

నిషాంత్ అగర్వాల్ పాకిస్థాన్ కు చెందిన కొందరు వ్యక్తులతో ఫేస్ బుక్ ద్వారా మాట్లాడుతున్నట్లు గుర్తించారు. నిందితుడిపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అదికారులు పేర్కొన్నారు.

రెండు నెలలక్రితం వివాహం చేసుకున్న నిశాంత్ వార్ధా రోడ్డులో అద్దె ఇంటిలో ఉంటున్నాడు. దీనిపై ఇంటి యజమాని మాట్లాడుతూ నిశాంత్ దాదాపు సంవత్సర కాలంగా ఇక్కడే అద్దెకు ఉంటున్నాడని, ఆధార్ కార్డుతో పాటు డీఆర్డీవో ఇచ్చిన కార్డు సంమర్పించాడన్నారు.

  • క్షిపణి పనితీరుbrahmos missile information leak

మామూలు క్షిపణుల కంటే ఇది మూడు రెట్ల అధిక వేగంతో గాలిలో ద్వనివేగం కంటే అధిక వేగంతో ప్రయాణిస్తుంది. ఇది 290 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ద్వని వేగం కంటే మూడు రెట్ల వేగంతో కచ్చితమైన ఏక్యూరేసీతో లక్ష్యాన్ని చేదిస్తుంది.

ప్రపంచంలోనే ఏకైక తొలి సూపర్ సోనిక్ క్షిపణి బ్రహ్మోస్ దీనిని యుద్ద విమానం, నౌక, సబ్మేరైన్ నుంచి లేదా నేలపై నుంచి కూడా దీనిని ప్రయోగించవచ్చు. ఇది తక్కువ ఎత్తులో శత్రు క్షిపణులను చేదిస్తుంది కావున దీనిని శత్రు రాడార్ వ్యవస్థ పసిగట్టలేవు. బ్రహ్మోస్ క్షిపణి కొండ ప్రాంతాలలో ఉండే శత్రువుల బంకర్లను మరియు శత్రువుల క్షిపణులను కచ్చితత్వంతో చేదిస్తుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular