శుక్రవారం, మార్చి 29, 2024
Homeఅంతర్జాతీయంగంగానది కి అణు ముప్పు | polution on ganga river

గంగానది కి అణు ముప్పు | polution on ganga river

ఐదు దశాబ్దాల క్రితం జరిగిన ఒక సీక్రెట్ ఆపరేషన్ ఇప్పుడు మన వెన్నులో వణుకు పుట్టిస్తుంది . చైనాపై నిఘా పెట్టడానికి హిమాలయాల్లోని నందాదేవి పర్వత శ్రేణులకు తరలించిన అనుపరికరం బవిష్యత్తులో ఏం ప్రకంపనలు రేపుతుందోనని గుబులు రేపుతుంది మంచులో కూరుకుపోయిన దాని జాడ పసిగట్టేందుకు కేంద్రం సన్నాహాలు మొదలు పెట్టింది .

 

1964 సంపత్సరం చైనా తొలిసారిగా అణుపరీక్షలు నిర్వహించి ప్రపంచదేశాలకు ముఖ్యంగా అమెరికాకు దడపుట్టించింది . చైనా అణుపాఠవం తెలుసుకోవడానికి అమెరికా భారత్ సహకారం కోరింది . భారత ఐబి-అమెరికా సీఐఏ లు కలిసి రహస్యం గా చైనా శివారులో హిమాలయాల్లో ఉన్న నందాదేవి పర్వత శ్రేణుల వద్ద నిఘా పెట్టడానికి ఫ్లుటోనియం క్యాప్సూల్స్ –ఏంటేనాలు అనుఇందనంతో నడిచే జనరేటర్ ను 1965 జూన్ 23 న ఏర్పాటు చేసారు .

ఆ తర్వాతా అక్టోబర్ లో పర్వత శ్రేణి వద్దకు వెళ్లి చూడగా ఈ రహస్య పరికరాలు లేవు మంచులో కూరుకుపోయాయి . వాటిని అలాగే వదిలేస్తే అణు విస్పోటనం జరిగి చాల నీరు కలుసితమయ్యే ప్రమాదముంది ఆ నీరు గంగానదిలో కలిస్తే పెద్ద ఎత్తున ప్రజలు మరియు జంతువులు చనిపోతారు.

ఇది రహస్య ఆపరేషన్ కావడంతో ఇన్నాళ్ళు బయటకు రాలేదు కానీ ఈ బృందానికి నేతృత్వం వహించిన కెప్టెన్ మన్మోహన్ సింగ్ కోహ్లి తాజాగా ఈ విషయం బయటపెట్టారు .

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular