Sun. Dec 9th, 2018

కానిస్టేబుల్ పరీక్షకు భారీగా హాజరైన విద్యార్ధులు

telangana police conisteble test

తెలంగాణ పోలీసు నియామక మండలి ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 40 ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన 966 పరీక్షా కేంద్రాల్లో 4,49,584 మంది అభ్యర్ధులు పరీక్ష రాసారు. పరీక్షలకు మొత్తం 94 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారని తెలిపారు.

16,925 పోస్టుల భర్తీకి ఈ ఏడాది మే 31 న జారీచేసిన నోటిఫికేషన్ కు అబ్యార్దుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ప్రతీ పరీక్షా కేంద్రంలో 90 శాతానికి పైగా అభ్యర్ధులు హాజరయ్యారు. ఈ పరీక్షను ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్ష నిర్వహించారు.police conistable test

రాష్ట్రవ్యాప్తంగా 40 ఎంపిక చేసిన ప్రాంతాల్లో పరీక్ష నిర్వహించారు. అభ్యర్ధుల యొక్క అటెండెన్స్ బయోమెట్రిక్ ద్వారా తీసుకున్నారు. ప్రిలిమినరీ పరీక్షకు సంబందిచిన ప్రాధమిక ‘కీ’ ని అధికారులు త్వరలోనే విడుదల చేయనున్నారు. ‘కీ’ విడుదల తర్వాతా మూడురోజుల పాటు అభ్యంతరాలకు గడువు ఇవ్వనున్నారు అనంతరం ఫైనల్ ‘కీ’ విడుదల చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *